శేరిలింగంప‌ల్లి ఓట‌రు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రి చేయాలి

  • బీజేపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, అధికారుల‌కు విన‌తిప‌త్రాల అంద‌జేత

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓట‌ర్ల జాబితాలో ఉన్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వారు గురువారం జీహెచ్ఎంసీ చందాన‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి స‌ర్కిళ్ల కార్యాల‌యాల వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం ఆయా స‌ర్కిళ్ల డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌కు ఓట‌ర్ జాబితాలో ఉన్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిచేయాల‌ని కోరుతూ విన‌తిప‌త్రాల‌ను అంద‌జేశారు.

శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ తేజావత్ వెంకన్నకు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు

ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర నాయ‌కుడు క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు తెరాస పార్టీకి అనుకూలంగా ఉన్న వారితో ఓట‌రు జాబితా త‌యారు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఓట‌రు జాబితాలో ఉన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశార‌న్నారు. ఇది తెరాస ప్ర‌భుత్వ చేత‌కానిత‌న‌మేన‌ని విమ‌ర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఓట‌రు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు ఉండ‌డం స‌రికాద‌ని, క‌నుక అందులో ఉన్న త‌ప్పుల‌ను వెంట‌నే స‌రిచేయాల‌ని డిమాండ్ చేశారు.

ఓట‌రు జాబితాలో కొంత మంది ఓట‌ర్ల‌ను తొల‌గించార‌ని, ఆ హ‌క్కును అధికారుల‌కు ఎవ‌రు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించాల‌ని అన్నారు. జాబితా నుంచి తీసేసిన వారి పేర్ల‌ను మ‌ళ్లీ అందులో చేర్చాల‌ని అన్నారు. ఒక డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న ఓట‌ర్ల‌ను ఇంకో డివిజ‌న్‌లో లేకుండా చూడాల‌న్నారు. చ‌నిపోయిన వారి ఓట్ల‌ను తొల‌గించాల‌ని, ఓట‌ర్లకు స‌మీపంలో పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని, డివిజ‌న్ల ప‌రిధిల‌లో బూత్‌ల వారీగా కొత్త లిస్ట్ ఇవ్వాల‌ని అన్నారు. ఈ అవ‌క‌త‌వ‌క‌ల‌ను వెంట‌నే స‌రిచేయాల‌ని, లేదంటే బీజేపీ ఈ విష‌యంపై పోరాటం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు.

చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బిజెపి నాయకులు

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియర్ నాయకులు బి. అశోక్, వసంత్ కుమార్ యాదవ్, మనోహర్, రాజశేఖర్, డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రామ్ రెడ్డి, వినయ్ బాబు, శ్రీధర్, జయ రాములు, కృష్ణా ముదిరాజ్, బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, ఐటీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఆంజనేయులు సాగర్, నరేందర్ ముదిరాజ్, నారాయణ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సురేష్ ముదిరాజ్, సురేష్ మట్ట, బాబు రెడ్డి, సురేష్ కురుమ, నాయకురాళ్లు లలిత, ప్రశాంతి, నాయకులు రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, శ్రీనివాస్ ముదిరాజ్, వేణుగోపాల్ గుప్తా, శివ ముదిరాజ్, జగదీష్, బీజేవైఎం నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, సిద్దూ, మధుసూదన్ రావు, ఆనంద్, నందు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here