శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా వారికి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషరేట్‌లో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజారావు భూపాల్‌లు ఈ సభలో పాల్గొని రిటైర్ అయిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ సమాజ హిత కార్యక్రమాల్లో పాల్గొనాలని, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీసీపీ సాయిశ్రీ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అడ్మిన్ ఏడీసీపీ రవిచందన్ రెడ్డి, మాదాపూర్ ఎస్‌బీ ఏడీసీపీ రవికుమార్, మేడ్చల్ ఎస్‌బీ ఏడీసీపీ ఎఫ్.రహమాన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సీఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ హనుమంత రావు, ఎస్‌బీ ఏసీపీ బి.ప్రకాష్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ అరుణ్, సీఏవో వెంకట్ రెడ్డి, ఎస్టేట్ అధికారి ఆర్ఐ హిమకర్, కో ఆపరేటివ్ సొసైటీ ఇన్‌చార్జి ఏఎస్ఐ జి.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
రిటైర్మెంట్ తీసుకున్న పోలీసు సిబ్బందిలో ఏసీపీ ఎన్.సుధీర్, ఏవో రషీదా బేగుమా, ఎస్ఐలు సేవ్యా నాయక్, పోచయ్య, విఠల్ రెడ్డి, మీర్జా అక్బర్ అలీ బేగ్, కోట మల్లేష్, వి.సంపత్ కుమార్, ఆర్ఎస్ఐ మార్కండేయ, ఏఆర్ఎస్ఐ భాస్కర్, ఏఆర్‌హెచ్‌సీలు రఘు, జాషువా తదితరులు ఉన్నారు.