నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఏకమయ్యారు. తోటి ఉద్యమకారుడు సయ్యద్ బాబుమియా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని పలువురు ఉద్యమకారులు శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లోని ఆయన స్వగృహంలో సయ్యద్ బాబుమియాను కలిసి పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారులమంతా ఏకతాటిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యమకాలంనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిమ్మల శేఖర్ గౌడ్, సంగారెడ్డి, షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.