నమస్తే శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా, తొలి ఉప ప్రధానమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసి మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన మహోన్నతుడు మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, గోపాల కృష్ణ, ఆంజనేయులు సాగర్, లక్ష్మణ్ ముదిరాజ్, బాలాజీ, గణేష్, మధు యాదవ్, రవి నాయక్, పద్మ, రేణుక, మల్లిక, నరసింహ, సాయి, శీను, రాము తదితరులు పాల్గొన్నారు.