నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని సరస్వతీ విద్యామందిర్ లో 75 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు పాఠశాల సెక్రటరీ మూగల రఘునందనరెడ్డి ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక పెద్దలు, పాలక వర్గం, ఉపాధ్యాయులు, విద్యార్ధుల సమక్షంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ బిల్డర్ వై.ఆనందరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.