శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శమని, తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా పంపిణీ చేస్తుందని, ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని నెహ్రూనగర్ రేషన్ షాప్ లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభం అయ్యిందని దేశంలోనే సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ప్రజాప్రభుత్వం అని రాష్ట్రంలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు యాదా గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, కేఎన్ రాములు, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్, కుమార్, రంజిత్, నాని, ఎల్లదాస్, దస్తగిర్, జగదీశ్, రాకేష్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.