చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో గురువారం సంకష్టహర చతుర్థి సందర్బంగా ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. కనుక భక్తులు ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆలయ కమిటీ సూచించింది. భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు స్వామి వారిని దర్శించుకోవచ్చు. కాగా పూజలకు హాజరు కాని వారు తమ గోత్ర నామాలతో ఆలయంలో పూజలు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో భక్తులు పూజలు, అభిషేకాలకు అయ్యే రుసుమును ఆన్‌లైన్ లో చెల్లించి పూజలు చేయించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఆలయ ఇన్‌చార్జి ఉమామహేశ్వర్ రావును 9492126990 అనే ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చు. అభిషేకం, అర్చనకు రూ.101 రుసుముగా నిర్ణయించారు.