హ‌ఫీజ్‌పేట‌లో ఘ‌నంగా స‌ద్దుల బ‌తుకమ్మ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ గ్రామంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండగను నిర్వ‌హించారు. బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ఫౌండేషన్, హనుమాన్ యూత్, దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

పెద్ద ఎత్తున బ‌తుక‌మ్మ ఆడుతున్న మ‌హిళ‌లు

వీరికి సత్తయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్ ప‌ర్స‌న్‌ బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ చేతుల మీదుగా బహుమతుల‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, యువతీ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాలింగ్ ల‌క్ష్మి గౌత‌మ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here