శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎన్‌క్లేవ్ కాలనీలో సర్వీ సమాజ్ ట్రస్ట్ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గామాత అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, అనిల్ రెడ్డి, కాశీనాథ్ యాదవ్, సందీప్ రెడ్డి, సాజిద్, సర్వీ సమాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు మనోజ్ చౌదరి, మంగిలాల్ పరిహరియా చౌదరి, వినోద్ చౌదరి, దేవరంజీ, బిక్రమ్ జి, కంగర్ సొయాల్ చౌదరి, హనుమాన్ సోయల్ చౌదరి, మంగీలాల్ సొన్పర చౌదరి, వినోద్ గెహ్లాట్ చౌదరి, వినయ్ చౌదరి, కెహ్వరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.