శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా షాద్గర్ నియోజకవర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ సంఘాలన్నీ ఏకమై బీసీ సంఘాలతో మమేకమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ సమగ్ర కుల గణన కార్యక్రమానికి సహకరించి అందరూ కూడా తమ తమ కులాల వారీగా యాదవ కులం వారు యాదవ్ అని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమగ్ర కుల గణన వల్ల యాదవులకు, బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు అమలవుతాయని రాజకీయంగా యాదవులకు, బీసీలకు వాటా దక్కుతుందని, రాజకీయ చైతన్యం కోసమే మన సంఘాలన్నీ నిరంతరం పోరాడుతున్నాయని అన్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా మనం మన గ్రామాలలో సర్వేలకు యాదవ్ అని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం సదర్ సంఘం అధ్యక్షుడు నడికుడి యాదగిరి యాదవ్, నడికుడి రఘునాథ్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, చంద్రయ్య యాదవ్, పద్మారం వెంకటేష్ యాదవ్, గున్న భీమయ్య యాదవ్, వెంకటేష్ యాదవ్, రాము యాదవ్, కృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, అశోక్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, రాజు యాదవ్, లోకనాథ్ యాదవ్ పాల్గొన్నారు.