శేరిలింగంపల్లి, నవంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు శనివారం మధ్యాహ్నం 3:30 గంటల నుండి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి సిఏస్ఆర్ నిధుల ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న గురునాథం చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కనుక మియాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఏసీ చైర్మన్ గాంధీ ఒక ప్రకటనలో కోరారు.