నమస్తే శేరిలింగంపల్లి: ర్యాష్ డ్రైవ్ తో పాటు అజాగ్రత్తగా బుల్లెట్ బండి నడుపుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కియా షోరూం నుంచి సన్ షైన్ ఆస్పత్రికి వెళ్లే దారిలో రోడ్డు దాటుతున్న గంధద్ర దోసు (45) ను టీఎస్ 07ఎఫ్ ఆర్ 4742 నంబరు గల బుల్లెట్ బండిని ర్యాష్ గా, అజాగ్రత్తగా డ్రైవ్ చేసి ఢీ కొట్టడంతో దోసు తీవ్రగాయాలకు గురయ్యాడు. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బులెట్ బండి నడిపిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.