మెరుగైన వసతుల కల్పనే ధ్యేయం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి:ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని, డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోని పలు బ్లాక్ ల వద్ద చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్, మ్యాన్ హోల్స్ పనులను పరిశీలించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించి తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులతో రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడి వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, రోజా, కుమారి, రాంచందర్, ఆర్ జమ్మయ్య, శ్రీనివాస్, మహేందర్, శ్రీనివాస్ నాయక్, హరి వెంకటేష్, రాంరెడ్డి, సాయి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here