శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పీజేఆర్ స్టేడియంలో స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రామొస్ మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ చైర్మన్, BRS సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ దేశ ప్రజలందరికీ దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తి చేయడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని విరులందరినీ మనం స్మరించుకోవాల్సిన సమయం ఇదని అన్నారు. ఈకార్యక్రమంలో స్పందన సేవా సంస్థ చైర్మన్ కొమ్ముల శ్యాము, పి జే ఆర్ స్టేడియం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బేకరీ ఆనంద్, షేక్ సలీం, అలిగే వినోద్, అబ్బురబోయిన రవి, షేక్ హాజీ, కోళ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






