శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న పాత ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా వెలసిన ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించారు. అమీన్‌పూర్ రోడ్డులో రహదారి నిర్మాణ పనులు కొనసాగనున్న నేపథ్యంలో డీసీ శశిరేఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగించారు.






