కూక‌ట్‌ప‌ల్లిలో రిల‌య‌న్స్ యానిమేష‌న్ అకాడమీ బ్రాంచ్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, మే 2 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ ప్రముఖ విద్యాసంస్థ రిల‌య‌న్స్ యానిమేష‌న్ అకాడమీ బ్రాంచ్ ను తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సీఈవో కే. నితిన్ రెడ్డి హాజ‌రై ప్రారంభించారు. సెంటర్ హెడ్ సుధీర్ సంభారపు నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మంలో నితిన్ రెడ్డి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఫిల్మ్ మేకింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి నాణ్యమైన శిక్షణా సంస్థలు యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రిలయన్స్ యానిమేషన్ అకాడమీ బిజినెస్ హెడ్ సందీప్ శెట్టి, దీపక్ జాద‌వ్, వరప్రసాద్ జెవి, సంయుక్త తుమ్మలశెట్టి, స్మితా గ్రంధి, శ్రావణి వోడితాల, బాదం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ప్రణీత, సిలంబరాసి, సృజన పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here