శిల్పారామంలో అల‌రించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శేరిలింగంప‌ల్లి, మే 2 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పద్మావతి ఆర్ట్ అకాడమీ, సూత్ర ఇన్స్టిట్యూట్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ గురువు క్రాంతి కిరణ్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మోదమున, వినాయక కౌతం, నమశ్శివాయతే , బ్రహ్మాంజలి, యేహి శ్రీనివాస్, జతిస్వరం, హిమగిరి తనయే , కొలువై ఉన్నదే, దేవా దేవం, బృందావన నిలయే, తిల్లాన అంశాలను మైరా , హరిణి, యశస్వినీ, శాన్విత, హ్రితిక, సాత్విక, తన్వి, లాస్య, శాన్వి, లలిత శ్రీ ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ నాట్య గురువు రోహిణి కందాల, వసంత సంధ్య, కీర్తన రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజ‌రై కళాకారులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here