నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసి గృహ నిర్బంధం చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి పాదయాత్ర శిబిరం నుండి కరీంనగర్ తరలించిన నేపథ్యంలో బిజెపి నిరసన దీక్షకు పిలునివ్వగా కరీంనగర్ లోని దీక్షా స్థలి వద్ద బండి సంజయ్ ను రవికుమార్ యాదవ్ కలిసి సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.