నమస్తే శేరిలింగంపల్లి: పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపకోవాలన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
,