నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహ్మద్ షాకీర్ నివాసంలో రంజాన్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి స్థానిక గోపి నగర్ ఈద్గాలో షాకీర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగ విందు ఆరగించారు. ఈ సందర్భంగా షాకీర్ డివిజన్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.