సీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త పాటించాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని శ్రీరామ్ నగర్ బీ బ్లాక్ కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీవాసులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలతో సరి అయిన పద్ధతిలో చేపట్టాలని, పాదచారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, క్రాంతి కిరణ్, నాగరాజు, నర్సింగ్ రావు, మోహన్ రెడ్డి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here