ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి‌ కృషి చేస్తా: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయసహకారాలు ఎప్పటికీ ఉంటాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని వీడియో కాలనీ లోని సెయింట్ రీటా ఉన్నత పాఠశాల ఆవరణలో శేరిలింగంపల్లి మండలంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ బీష్మ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ శంకర్, ట్రెజరర్ విజయ్ కుమార్, అడ్వైజర్ ఎన్ ఎస్ రావు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాపిరెడ్డి, ఎస్ఎన్ రెడ్డి , రాంచందర్, ఏఆర్ సీ రెడ్డి, అనిల్ కుమార్, లయన్ డా.బొరుసు వెంకటేశ్వర రావు, వాసుదేవరావు, ఫణి కుమార్ , ఆచార్య, నరేంద్ర బాబు, నిజాం అలీ ఖాన్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గురుపూజోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here