శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): మే 10న పరేడ్ గ్రౌండ్‌ల జరగనున్న జనాగ్రహ సభ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బాల్ద అశోక్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, బూత్ ప్రెసిడెంట్లు హాజరై సభ విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






