పోలా రంగ‌నాయ‌క‌మ్మ ట్ర‌స్టు ఆద్వ‌ర్యంలో నిరుపేద కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని పోలా రంగ‌నాయ‌క‌మ్మ ట్ర‌స్ట్ చైర్మ‌న్ పోలా వాణీ కోటేశ్వ‌ర్‌రావు ఆద్వర్యంలో సోమ‌వారం స్థానిక నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్ఎస్ చందాన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ట్ర‌స్టు త‌ర‌పున 40 నిరుపేద కుటుంబాల‌కు బియ్యంతో పాటు ఇత‌ర నిత్యావ‌స‌రాల‌ను పంపణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా వికృత చ‌ర్య‌కు ఎంతో మంది నిరుపేద‌లు బ‌ల‌య్యార‌ని, అలాంటి వారిని స‌మాజం ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న కుటుంబాల‌కు చేయూతనందించేందుకు ముందుకు వ‌చ్చిన పోలా రంగ‌నాయ‌క‌మ్మ ట్ర‌స్టు ప్ర‌తినిధుల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మల్లేష్ పబ్బ, పోలా రంగనాయకమ్మ ట్రస్టు సభ్యులు డి.సుధాకర్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అంతి రెడ్డి, శ్రీనివాస్ పబ్బ, విజయలక్ష్మి, వాణి, జితమన్యు, సాయి సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ డివిజ‌న్ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్‌రెడ్డి, పోలా రంగ‌నాయ‌క‌మ్మ ట్ర‌స్టు ప్ర‌తినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here