నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న హైటెక్స్ లో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో భాగంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. సమావేశానికి హాజరయ్యే వారి కోసం టాయిలెట్లు, వాటి నిర్వహణ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ నాయకులు సయ్యద్ గౌస్, కృష్ణ గౌడ్, శ్యామ్, హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు రఘునాథ్, నయీం, రాము, రషీద్, శ్రీనివాస్ నాయక్, తైలి గిరి, గంగారాం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అనిల్, ఖాసిం తదితరులు ఉన్నారు.