నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత అండగా మారిందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కి చెందిన షేక్ వసీం కు రూ. 2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు బరోసాగా నిలుస్తోందన్నారు. చికిత్స చేసుకున్నాక వైద్య ఖర్చులు, అత్యవసర చికిత్స కోసం ముందస్తు సహాయం కింద ఎల్ ఓ సీ, సీఎంఆర్ఎఫ్ అందజేయడం జరుగుతుందన్నారు. పేదలకు ఆపన్నహస్తంలా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ రంగరావు, టీఆర్ఎస్ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు, నాయకులు బ్రిక్ శ్రీను, రామరాజు, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.