ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతారు: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అయ్య‌ప్ప‌సొసైటీ వాసుల‌తో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ నిర్వ‌హించిన స‌మావేశంలో గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
పాల్గొన్న అయ్య‌ప్ప సొసైటీ వాసులు

ఈ సంద‌ర్భంగా ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంప‌ల్లిలో ప్ర‌జ‌లు తెరాసకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు డిపాజిట్లు గ‌ల్లంత‌వ్వ‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు తెరాస అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఎదురు చూస్తున్నార‌న్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే తెరాస అభ్యర్థుల‌ను గెలిపిస్తాయ‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు క‌ల్ల‌బొల్లి మాట‌ల‌ను చెప్ప‌డం త‌ప్ప ప్ర‌జ‌ల‌కు త‌మ ప్ర‌భుత్వాల హ‌యాంలో చేసిందేమీ లేద‌న్నారు. కేవ‌లం తెరాస‌తోనే గ్రేట‌ర్ అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. ప్ర‌జ‌లు కారు గుర్తుకే ఓటు వేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌చారం…
మాదాపూర్ డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు ఎర్ర‌గుడ్ల శ్రీ‌నివాస్ యాద‌వ్‌లు శ‌నివారం డివిజ‌న్ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్, సాయిన‌గ‌ర్ తండాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తెరాస అభ్య‌ర్థుల‌నే గెలిపించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here