గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్లో వరద ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ శుక్రవారం పంపిణీ చేశారు. కాలనీలో వరద ముంపు బాధితులను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేశామని, వారు లబ్ధిదారులను గుర్తించి సహాయం పంపిణీ చేశారని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, సిబ్బంది, నేతాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలరాజ్ నాయక్, నాగేష్ నాయక్, సంతోష్, మహేష్, మోహన్ చారి, పద్మమ్మ, రాంబాబు నాయక్, జై రాం నాయక్, సురేష్, ఆశ, బేగం, శారద పాల్గొన్నారు.