నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన యోగా మహోత్సవంలో చందానగర్ నుంచి పతంజలి యోగా సభ్యులు తరలివెళ్లారు. చందానగర్ నుంచి 80 మంది సభ్యులు వెళ్లగా వారిలో గుల్ మొహర్ పార్కు కాలనీ సభ్యులు 36 మంది పాల్గొన్నట్లు యోగా గురువులు నూనె సురేందర్, గారెల వెంకటేష్ తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు అడవి శేషు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రావుతో యోగా మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శివకుమార్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియం, శివశంకర్ పార్కు, గుల్ మొహర్ పార్కు సభ్యులు వినయ్ కుమార్ పుట్ట, విఠల్, అన్నపూర్ణ, వెంకటలక్ష్మీ, గాయత్రి, విజయ, మదు పాటిల్, ఉదయ కుమారి, భాస్కర్, నగేష్, శ్రీరామ్, హరిఓం, రెడ్డి తదితరులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.