నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్ మెంట్ లోని నాల్గో అంతస్తుపై నుంచి ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం మియపూర్ దీప్తిశ్రీనగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉప్పలూరి నాగ సందీప్(32) దుబాయ్ నుంచి 15 రోజుల క్రితమే వచ్చాడు.
అపార్ట్ మెంట్ పై ఉన్న వాటర్ ట్యాంకు పై నుంచి కింద పడిపోయి సెల్లార్ లో రక్తపు మడుగులతో ఉన్న సందీప్ ను తండ్రి సుబ్రహ్మణ్యం చూసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించగా తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకహని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.