పరిశుభ్రత విషయంలో రాజీపడితే సహించేది లేదు: డీసీ సుధాంశు నందగిరి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశు నందగిరి మంగళవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మియాపూర్, శారదానగర్, మంజీరా పైప్ లైన్ రోడ్ లో పారిశుద్ధ్య సిబ్బంది విధులను పరిశీలించారు. శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తో పారిశుద్య అంశాలపై ప్రత్యేకంగ చర్చించారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడేది లేదని సిబ్బందికి డీసి హెచ్చరించారు. సర్కిల్ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని వారికి సూచించారు.

పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడుతున్న ఉప కమిషనర్ సుధాంశు నందగిరి, ఎస్ఎస్ శ్రీనివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here