పాత కక్షలతో దద్దరిల్లిన పాపిరెడ్డి కాలనీ – బీరు బాటిల్ తో హత్య చేసి లొంగిపోయిన నిందితుడు..?

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పాపిరెడ్డి కాలనీలో పాతకక్షలతో అర్థరాత్రి జరిగిన హత్య ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీకి చెందిన అంజి(35) స్థానికంగా డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన నాగేష్(32) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అంజికి, నాగేష్ కు ఏవో చిన్నచిన్న తగాదాలతో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి పాపిరెడ్డి కాలనీలోని వడ్డెర సంఘం వద్ద గల ఆలయ ప్రాంగణంలో నాగేష్ బీరు‌ బాటిల్ తో అంజి తలపై మోదాడు. తీవ్ర రక్త స్రావంతో అంజీ మృతి చెందాడు. అనంతరం నింధితుడు నాగేష్ తనంతట తానే చందానగర్ ‌పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం. కాగ చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే కారణమా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే‌ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.

హత్యకు గురైన అంజి మృతదేహం
అంజి (పైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here