PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి మాతృ శ్రీ నగర్ కాలనీ వాసుల విన‌తి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని త‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర‌చాలని, అవసరమున్న చోట UGD పైప్ లైన్లు వేయాలని, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు గాంధీ సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లోనే కాల‌నీలో ప‌ర్య‌టిస్తాన‌ని, స‌మ‌స్య‌లన్నింటినీ ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు అనిల్ కావూరి, నాగరాజు, కిషోర్, విజయ్, చందు, రమణ, గోపి, సతీష్, వంశీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here