శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రధాన కార్యాలయంలో GHMC కమిషనర్ ఇలంబరితిని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. ఇందుకు GHMC కమిషనర్ ఇలంబరితి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.