శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ రెడ్డికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరు పత్రాన్ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొన్నారు.

అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదురైనప్పుడు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని గాంధీ తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





