వివేకానంద‌న‌గ‌ర్‌లో ఓట్లు అడిగే హ‌క్కు టీఆర్ఎస్‌కే ఉంది

  • ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
  • తెరాస కార్పొరేట‌ర్‌ అభ్య‌ర్థి రోజా రంగారావును భారీ మెజారిటీతో గెలిపించాలి

వివేకానంద‌న‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో గ‌తంలో ఎన్న‌డూ లేన‌టువంటి అభివృద్ధి చేశామ‌ని ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ఆదివారం డివిజ‌న్ ప‌రిధిలోని రిక్షాపుల్ల‌ర్స్ కాల‌నీలో డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్‌ అభ్య‌ర్థి రోజా రంగారావుకు మ‌ద్ద‌తుగా వారు ఇంటింటికీ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ.. వివేకానంద నగర్ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రోజా రంగారావుని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. వివేకానంద నగర్ డివిజన్ లో రూ.50 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. డివిజన్ లో రోడ్లు గతంలో కన్నా ఎంతో బాగుపడ్డాయని అన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, తెరాస కార్పొరేట‌ర్‌ అభ్య‌ర్థి రోజా రంగారావు

శేరిలింగంపల్లి అంటేనే దేశంలోని వివిధ రాష్టాలు, భిన్న ప్రాంతాల ప్రజలు ఉండే తెలంగాణ గుండె కాయ అన్నారు. గతంలో వాగ్దానాలు చేసినవే కాక అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం నూతన చట్టం ఉపయోగపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రాంత అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. అందరి మన్ననలు పొందిన మాధవరం రోజా రంగారావును గెలిపించాలని కోరారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి

వరద బాధితులకు వరద సహాయం ఎన్నికల తర్వాత అందిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడబోమని అన్నారు. ఎన్నికల తరువాత మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని, 7 లక్షల ఓటర్లు ఉన్న మినీ భారత్ లాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అని అన్నారు.కేంద్రం నిధులు ఇవ్వకున్నా అభివృద్ధి ఆగలేదన్నారు. కరోనా కాలంలో అందరికీ బియ్యం, నగదు పంపిణీ చేసి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉందన్నారు. అభ్యర్థి మాధవరం రోజా రంగారావు మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, అభిప్రాయల ప్రకారం పని చేస్తానని అందరూ ఆశీర్వదిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here