గోల్డెన్ తులిప్ లో ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:  కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ పార్క్ లో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను ప్రభుత్వ విప్ ఆరె కపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోల్డెన్ తులిప్ కాలనీలో ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అ న్నారు. ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు, పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని చెప్పారు.

గోల్డెన్ తులిప్ కాలనీ పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని, ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ లకు విపరీతమైన ఆదరణ లభించటం ఎంతో సంతోషదాయకమన్నారు. అనంతరం వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొని, పార్క్ ప్రాంగణంలో మట్టి వినాయకుల నిమర్జనం కోసం ఏర్పాటు చేసిన కొలనను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, దీపక్ మరియు గోల్డెన్ తులిప్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి , SVN రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here