నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ వద్ద జైన్స్ కార్ల్టన్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు . అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాల తోనే జరుపుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. విఘ్నేశ్వరునికి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, జైన్స్ కార్ల్టన్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షులు మల్లికార్జున్ జైన్స్ కార్ల్టన్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు, భక్తులు, కమ్యూనిటీ కమిటీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు