విద్యార్థులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా నోట్ బుక్స్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కడుమూర్ గ్రామ ఉపసర్పంచ్ బేరి రామ్ చందర్ యాదవ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి మారుమూల గ్రామ విద్యార్థులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేయగా వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ విద్యార్థులకు సుమారుగా 450 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ ను రాన్స్ ఇన్ ప్రా కన్‌స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా ఉచిత నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని అన్నారు. ఎంఈఓ హరిచందర్ నాయక్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీశైలం యాదవ్, బేరి రాంచందర్ యాదవ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు, రాగం అనిరుద్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఉపసర్పంచ్ ల సంఘం ప్రెసిడెంట్ బేరి రాంచందర్ యాదవ్, ఎంఈఓ హరిచందర్ నాయక్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీశైలం యాదవ్, ఆంజనేయులు, శ్రీకాంత్ యాదవ్, మల్కయ్య, జమ్మయ్య, సుమన్ లు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఉచితంగా నోట్ బుక్స్ అందజేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here