చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్‌స్టేషన్ 11కేవీ జవహర్ నవోదయ ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాయిరాం కాలనీ, కంచ గచ్చిబౌలి, రాంకీ, అపర్ణ జెనెక్, దయ్యం బోర్డులలో, నల్లగండ్ల హుడా ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నల్లగండ్ల హుడా, నల్లగండ్లలో కరెంటు ఉండదని తెలిపారు.