నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి నానక్‌రామ్‌గూడ కల్కి మాతా శీత్ల మాతా ఆలయంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కల్కి మాతా శీత్ల మాతా ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ప్రార్ధించారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరగా దేశ ప్రజలను ప్రధానంగా మన రాష్ట్రానికి విముక్తి కలగాలని ఆ శ్రీరామచంద్రుడిని మనసారా వేడుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అవసరం ఉంటె తప్ప బయటికి వెళ్ళవద్దని, ఒకవేళ వెళ్లిన తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.