కార్మికుల ఐక్యత వర్థిల్లాలి – వాడవాడనా ఎగిరిన ఎర్రజెండా – శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు ఈ మేడే అని, కార్మికుల శ్రమను గౌరవించి వారి శ్రమను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అసంఘటిత రంగాల కార్మిక, కర్షక, ఉద్యోగ సోదరులందరికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది పని గంటలకోసం ప్రారంభమైన కార్మికుల పోరాటం నేడు ప్రపంచ వ్యాప్తంగా మేడే ఉత్సవంగా పరిఢవిల్లిందన్నారు. శ్రామిక శక్తిని మించిన ఆస్థి లేదని, శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదన్నారు. కార్మికులు రక్తాన్ని స్వేదంగా మార్చి, ఎన్నో అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం తెలుపుతున్నామని చెప్పారు. కార్మికులంతా ఆరోగ్యంగా సుఖ సంపదలతో బాగుండాలని ఆకాంక్షించారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం చౌరస్తాలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలిపారు.

మియాపూర్ లోని ఆటో స్టాండ్ వద్ద టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఆవిష్కరించిన మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో..

మేడే సందర్బంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో పార్టీ జెండాను అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సమాఖ్య కోశాధికారి అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ సతీమణి తాండ్ర కళావతి ఎగవేశారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదె గోని రవి మాట్లాడుతూ చికాగో నగరం హే మార్కెట్ లో 1886లో నెత్తురు చిందించి ఎర్ర జెండా ఎగుర వేసిన అమరవీరుల దినం మేడే దినోత్సవం అన్నారు. ఎనిమిది గంటల పని కోసం జరిగిన కార్మిక వర్గ పోరాటం దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, అతి తక్కువ స్థాయి వేతనాలు, ఎలాంటి పని భద్రత లేని ఉద్యోగులు గత నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ కోడ్ లు అమలైతే మరింత నిరుద్యోగానికి దారితీస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణ జరగడంతో ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలతో నడుస్తున్నా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. ఆదాని, అంబానీ, సంపన్న వర్గాలకు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతోనే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి కుంభం సుకన్య, ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వి.తుకారం నాయక్, భద్ర, ముని, పురుషోత్తం, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆర్ ఝాన్సీ, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర రాజేష్, ఏఐఎఫ్ డీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన తాండ్ర కళావతి

మియాపూర్ లో..‌
మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రస్తుత దోపిడీ వ్యవస్థ పై పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మేడే కార్మికుల పోరాట స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థను ఎదుర్కోవాలని అన్నారు. నాడు ఎనిమిది గంటల పని విధానం గురించి వందలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే నేడు మళ్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉధృతమై 12 గంటల పనివిధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు. పెట్టుబడిదారి పాలకవర్గాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో కామ్రేడ్ తాండ్ర కళావతి, తుడుం అనిల్ కుమార్, టేకు నరసింహ నగర్ లో శంకర్, నడిగడ్డ తాండ లో కామ్రేడ్ కుంభం సుకన్య, ఓంకార్ నగర్ లో పల్లె మురళి, మియాపూర్ బస్ స్టాండ్ కన్నశ్రీనివాస్, మక్త మహబూబ్ పేటలో మైధం శెట్టి రమేష్, పోగుల ఆగయ్య నగర్ లో కర్ర దానయ్యలు జెండాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వనం సుధాకర్, ఏ.పుష్ప, బి.రవి, జీ.లావణ్య, దార లక్ష్మి, సుల్తానా, శివాని, గణేష్, నాగభూషణం, నర్సింగ్, వెంకటాచారి, రతన్ నాయక్, లలిత, ఇస్సాక్, రాంబాబు, అమీనా,రజియా తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ స్టాలిన్ నగర్ లో జెండాను ఎగరవేస్తున్న ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్

సీపీఐ ఆధ్వర్యంలో..
136వ మేడే దినోత్సవాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఖానా మెట్, ఇజ్జత్ నగర్, కొండాపూర్ ఇనార్బిట్, గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్, సి ఆర్ ఫౌండేషన్ హఫీజ్ పెట్, అంజయ్య నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగరవేసి కార్మికుల ఐక్యత చాటారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన అంతమై కార్పొరేట్ పాలన కొనసాగుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలు కోరినట్లు కార్మికవర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలతో నాలుగు కోడ్ లను తెచ్చిందన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని సంవత్సర కాలం పాటు రైతులు నిరంతర పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల చట్టాలను రద్దు చేసి ఉన్న చట్టాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ, ఏఐటీయూసీ చందు యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కె నర్సింహారెడ్డి, రక్తపు వినయ్ గౌడ్, కే కాశీం, అడ్వకేటు రవి, వెంకటేష్, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ కార్మిక దినోత్సవంలో‌ పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు

సీఐటీయూ ఆధ్వర్యంలో..
మేడే స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలతో ముందుకు సాగుతామని సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ మూదిరాజ్ అన్నారు. 136వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని మియాపూర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ లో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చాక కేవలం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని వాపోయారు. కొంత మంది వ్యక్తుల సంస్థల ప్రయోజనం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాప్ సిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రవీందర్, చారి తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే లో పాల్గొన్న సీఐటీయూ జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ ముదిరాజ్

టీఎంఈడబ్ల్యుఏ ఆధ్వర్యంలో…
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించింది. శేరిలింగంపల్లి జోన్ కార్యాలయంలో, చందా నగర్, యూసుఫ్ గూడ సర్కిల్ కార్యాలయాలలో జెండావిష్కరణ చేశారు. టీఎంఈడబ్ల్యుఏ గ్రేటర్ ఉపాధ్యక్షుడు జలంధర్ రెడ్డి, రాష్ట్ర జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్, కార్యనిర్వహక అధ్యక్షుడు నాగేశప్ప పాల్గొని కార్మికుల హక్కుల సాధన, వాటి పరిరక్షణపై మాట్లాడారు. మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జవాన్ వెంకటేష్, యూనియన్ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి, కనకరాజు, బాలరాజు, భరత్ రెడ్డి, కృష్ణ, బాలాజీ, ప్రసాద్, రామప్ప, ఉపాధ్యక్షుడు బిక్షపతి గౌడ్, అచ్యుత్, శేరిలింగంపల్లి జోన్ ప్రెసిడెంట్ నారాయణ స్వామి నాయక్, రమేష్ నాయక్, చందా నగర్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, శేరిలింగంపల్లి సర్కిల్ కోశాధికారి రాజేష్ యాదవ్, సహా కార్యదర్శి శివ కుమార్, కర్ణ, శ్రీనివాస్ గౌడ్, చందానగర్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జితేందర్ నాయక్, వివిధ సర్కిల్ స్థానిక పారిశుద్ధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. యూసుఫ్ గూడ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ రవి, ప్రధాన కార్యదర్శి భాస్కర్, శంకర్, శ్యామ్, దాసు, రాజారెడ్డి వారి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి కార్మికులకు నే డే శుభాకాంక్షలు తెలిపారు. ఆయా‌ శాఖల అధికారులు, యూనియన్ నాయకులు, హౌస్ కీపింగ్ కార్మికులు, ట్రాన్స్ పోర్టు విభాగం, ఎంటమాలజీ విభాగం, పారిశుద్ధ్య విభాగం కార్మికులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం లో ఐక్యత చాటుతున్న కార్మిక సంఘాల నేతలు
ఎర్రజెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here