మున్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగాలి: తుడి సుప్రజా ప్రవీణ్

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని చందాన‌గ‌ర్‌లో ఉన్న క్రిస్ట‌ల్ గార్డెన్‌లో శేరిలింగంపల్లి మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో తుడి సుప్రజా ప్రవీణ్, కొమిరిశెట్టి సాయిబాబా, గాలి అనిల్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, సి. విట్ఠల్ లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సుప్రజా ప్రవీణ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో ఉన్న 40వేల మంది మున్నూరు కాపులంతా ఓకే తాటి పైకి రావాలని కోరారు. ఈ వేదికగా అందరూ ఐక్యం కావాలని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళ‌నాల‌ను తెలంగాణ అంతటా నిర్వ‌హించాల‌ని అన్నారు. ముఖ్య నాయకుడు, మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ రావు, రౌతు కనకయ్య, ఎం. నర్సింగ్ రావు, ఆవుల రమేష్, పుట్టం పురుషోతం, కొండ దేవయ్య, ఎం. నారాయణ, ఉగ్గే శ్రీనివాస్ పటేల్, వాసల వెంకటేష్, మల్లం మధు, అలువల సునీల్ కుమార్ పాల్గొన్నారు.

ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొనేందుకు వెళ్తున్న తుడి సుప్రజా ప్రవీణ్, కొమిరిశెట్టి సాయిబాబా, గాలి అనిల్ కుమార్ త‌దిత‌రులు
స‌మావేశంలో అభివాదం చేస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here