- శేరిలింగంపల్లి సర్కిల్‌లో ప్రతిష్టాత్మకంగా కూపన్ బదులు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్…
- కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లోను కొత్తగా సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్…
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో మూడవ రోజు సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం ముగిసింది. ఐతే శేరిలింగంపల్లి సర్కిల్లో కూపన్‌లకు బదులు ఆదివారం నుంచి ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల పేర్లు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో సంధ్య కన్వెన్షన్‌లో 482 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. గత రెండు రోజులతో పోలిస్తే సంఖ్య కొంచం తగ్గినప్పటికి నిజమైన లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందిందని పలువురు అభిప్రాయ పడ్డారు. ఈ ప్రక్రియను జీహెచ్ఎంసీ అంతటా అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా చందానగర్ సర్కిల్‌లోని పీజేఆర్ స్టేడియంలో 703 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రత్యేకంగా కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లోనూ సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలో 265 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆరుగురికి కోవాక్జిన్ రెండవ డోసు ఇచ్చినట్టు సుపరింటెండెంట్ వరదాచారి తెలిపారు.