నమస్తే శేరిలింగంపల్లి: మారబోయిన సందయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆర్‌కేవై ప్రాణహేతు ఆధ్వర్యంలో గురువారం శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బందికి, మియాపూర్ పరిధిలోని పూజారులకు ప్రశాంత్‌నగర్ రామాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు కార్యదర్శి, బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోను ప్రజారోగ్యం విషయంలో శక్తివంచన లేకుండా కష్టపడుతున్న ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్లకు మానవతా దృక్పతంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూతబడి మనుగడకు కష్టమైన అర్చకులకు తోచిన రీతిలో నిత్యావసర సరుకులు అందజేశామని అన్నారు. ఇక మీదట కూడా ప్రతిరోజు ఆర్‌కేవై ప్రాణ హేతు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, ఎల్లేష్, ఆర్‌కేవై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, నాయకులు వినోద్ యాదవ్, రాము, శ్రీనివాస్ యాదవ్, సోను యాదవ్, శ్రీను, చంద్ర మాసి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

