నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో కరోనా నియంత్రణపై సమీక్షిస్తున్నామని, కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరం గోపాల్ రావు, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, స్థానిక నాయకులు, ఎస్ ఆర్ పి కనకరాజు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.