నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని గంగారం ఆలయం నుండి అపర్ణ వరకు నిర్మించబోయే వంద ఫీట్ల రోడ్డు ను వెంటనే చేపట్టి అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వంద ఫీట్ల రోడ్డుకు సంబంధించిన ప్రణాళికలను పరిశీలించారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన లింక్ రోడ్డు పనులను వెంటనే చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రోడ్డు పనులను త్వరితగతిన చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. అందుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అధికారులకు అందజేశారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ డీసీపీ గణపతి ,ఏసీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.