నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాటు పడుతానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల మైనార్టీ నాయకులు పలు సమస్యలపై చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై గురువారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక వసతులను కల్పించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహ్మద్ ఖాజా, మోహినుద్దీన్, ఇబ్రహీం, గౌస్, యాదుల్లా, అజిస్, నవాబ్, అల్లవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.