నమస్తే శేరిలింగంపల్లి: సగరుల కోసం కోకాపేటలో ఇదివరకు కేటాయించిన స్థలాన్ని మార్చకుండా చూడాలని రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర నాయకులు, వనపర్తి జిల్లా సగర సంఘం నాయకులు గురువారం మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సగరుల వినతి మేరకు మంత్రి సానుకులంగా స్పందిస్తూ సంబంధిత బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ముందుగా కేటాయించిన స్థలాన్ని సగరులకు కొనసాగించే విదంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అందుకు సంఘం నాయకులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు గంగ పూరి స్వామి సాగర్, చీర్ల విష్ణు సాగర్, వినోద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.