నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ లో శ్రేయ హాస్పిటల్ అక్రమ నిర్మాణ భవనంపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు, ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ శంకరయ్యకు ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 అధికారులు, నోడల్ అధికారి నిర్లక్ష్యం తో అక్రమ భవన నిర్మాణాన్ని యథేచ్ఛగా నిర్మిస్తున్నారని మిద్దెల మల్లారెడ్డి అన్నారు. పాత పురాతన భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా మరో మూడంతస్తుల భవనాన్ని శ్రేయ ఆస్పత్రి యాజమాన్యం నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం అన్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్పత్రికి వచ్చే అమాయక ప్రజల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అక్రమ భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.